Mahmood Ali: సృహ తప్పి పడిపోయిన మాజీ హోంమంత్రి మహమూద్ అలీ.. వీడియో ఇదిగో

Former Dy CM Mahmood Ali faints during Republic Day celebrations
  • తెలంగాణ భవన్ లో రిపబ్లిక్ వేడుకలు
  • జాతీయ జెండాను ఆవిష్కరించిన కేటీఆర్
  • వేడుకలో అస్వస్థతకు గురైన మహమూద్ అలీ

తెలంగాణ మాజీ హోంమంత్రి, బీఆర్ఎస్ నేత మహమూద్ అలీ స్పృహతప్పి కిందపడిపోయారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఉదయం గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మహమూద్ అలీతో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మహమూద్ అలీ అస్వస్థతకు గురయ్యారు. స్పృహ తప్పి కిందపడిపోయారు. పక్కనున్న సహచర నేతలు ఆయనను పట్టుకున్నారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి బాగున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News