Nara Lokesh: జాతీయ జెండా ఎగురవేసిన నారా లోకేశ్

Nara Lokesh hoists national flag
  • హైదరాబాదులోని తన నివాసం వద్ద జెండా ఎగురవేసిన లోకేశ్
  • గాంధీ, అంబేద్కర్ చిత్రపటాలకు నివాళి అర్పించిన యువనేత
  • ప్రజలకు రిపబ్లిక్ డే గ్రీటింగ్స్ తెలిపిన లోకేశ్

గణతంత్ర దినోత్సవం సందర్భంగా టీడీపీ యువనేత నారా లోకేశ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. హైదరాబాదులోని తన నివాసం వద్ద జెండాను ఎగురవేశారు. మహాత్మాగాంధీ, బీఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళి అర్పించారు. మరోవైపు ఎక్స్ వేదికగా ప్రజలకు లోకేశ్ రిపబ్లిక్ డే గ్రీటింగ్స్ తెలియజేశారు. మహోన్నతమైన ప్రజాస్వామ్యం, మహోజ్వలమైన చరిత్ర మనదని లోకేశ్ అన్నారు. స్వేచ్ఛ, సమానత్వం, హక్కులను మన రాజ్యాంగం ప్రసాదించిందని చెప్పారు. ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు. 

  • Loading...

More Telugu News