Gyanvapi Mosque: జ్ఞానవాపి మసీదు కింద దొరికినవి ఇవే..!

Shivling broken deity statues in Gyanvapi survey report
  • 839 పేజీల నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన ఏఎస్ఐ
  • పగిలిన స్థితిలో ఉన్న వినాయకుడు, హనుమంతుడు, శివలింగం వంటివి మసీదు కింద లభ్యం
  • కొన్ని నాణాలు, పర్షియన్ లిపి ఉన్న శాండ్‌స్టోన్ సహా పలు విగ్రహాలు
  • హిందూ ఆలయాన్ని కూల్చి మసీదును నిర్మించారంటున్న హిందూ వర్గాలు
  • నిర్ద్వంద్వంగా తోసిపుచ్చిన ముస్లిం వర్గాలు

వారణాసిలోని జ్ఞానవాపి మసీదుపై ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) ఇచ్చిన నివేదిక దేశంలో సరికొత్త వివాదానికి కారణమైంది. మసీదు సముదాయం లోపల దొరికిన హిందూ దేవతల వస్తువులు (విగ్రహాలు) ఇవేనంటూ తాజాగా కొన్ని ఫొటోలు వెల్లడయ్యాయి. వీటిలో పగిలిన స్థితిలో ఉన్న హనుమంతుడు, వినాయకుడు, నంది, శివలింగంతోపాటు శివలింగాన్ని ఉంచే పీఠం వంటివి ఉన్నాయి. 

వీటితోపాటు నాణాలు, పర్షియన్ లిపిలో ఉన్న శాండ్‌స్టోన్ స్లాబ్, రోకలిబండ, ధ్వంసమైన స్థితిలో ఉన్న వివిధ విగ్రహాలు ఉన్నాయి. మొత్తం 839 పేజీలతో ఉన్న ఈ నివేదిక చూసిన తర్వాత.. అక్కడ అప్పటికే ఉన్న హిందూ దేవాలయాన్ని కూలగొట్టి దానిపై మసీదు నిర్మించారని హిందూ వర్గాలు చెబుతున్నాయి. తవ్వకాల్లో లభించిన ఆధారాలను బట్టి చూస్తే 17వ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు కాలంలోనే అక్కడ ఆలయాన్ని కూల్చేసి మసీదు నిర్మించి ఉంటారని స్పష్టమవుతోందని చెబుతున్నారు. హిందువుల వైపు వాదనలను అంజుమన్ అంజమియా మసీదు కమిటీకి ప్రాతినిధ్యం వహిస్తున్న అఖ్లక్ అహ్మద్ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు.

  • Loading...

More Telugu News