Actor Vijay: కోలీవుడ్ నటుడు విజయ్ కొత్త పార్టీకి సర్వం సిద్ధం.. రిజిస్ట్రేషనే తరువాయి?

Kollywood Star Vijay Ready To Start New Political Party
  • మక్కల్ ఇయక్కం నిర్వాహకులతో విజయ్ సమావేశం
  • పార్టీ ప్రారంభించాల్సిందేనని సమావేశంలో డిమాండ్
  • తొలిసారి పార్టీ గురించి మాట్లాడిన విజయ్
  • లోక్‌సభ ఎన్నికల్లో బరిలోకి దిగడమా? ఏదైనా పార్టీకి మద్దతివ్వడమా? అన్నదానిపై త్వరలో నిర్ణయం

కోలీవుడ్ ప్రముఖ నటుడు విజయ్ త్వరలోనే కొత్తపార్టీ ప్రారంభించబోతున్నట్టు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలకు మరింత బలం చేకూర్చే ఘటన నిన్న చెన్నైలో జరిగింది. పనయూర్‌లోని తన కార్యాలయంలో విజయ్ మక్కల్ ఇయక్కం నిర్వాహకులతో విజయ్ సమావేశం నిర్వహించారు. చెన్నై, కోవై, తిరుచ్చి, మధురై సహా అన్ని జిల్లాల నుంచి 150 మంది నిర్వాహకులు పాల్గొన్నారు. సమావేశంలో పాల్గొన్నవారు విజయ్ రాజకీయ పార్టీ ప్రారంభించాల్సిందేనని డిమాండ్ చేశారు. 

విజయ్ కూడా గతానికి భిన్నంగా రాజకీయాలపై చర్చించినట్టు తెలిపారు. అంతేకాదు, మరో ఆరు నెలల్లో ఆయన కొత్త పార్టీ ప్రారంభించబోతున్నట్టు కూడా వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. పార్టీ పేరు ఖరారు చేసి నమోదు చేసిన తర్వాత త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ఏదైనా పార్టీకి మద్దతివ్వాలా? లేదంటే ఒంటరిగా బరిలోకి దిగాలా? అన్న అంశంపై మరోమారు నిర్వాహకులతో విజయ్ సమావేశమవుతారని సమాచారం.

  • Loading...

More Telugu News