Fire Accident: తెలంగాణ సచివాలయం సమీపంలో కారు దగ్ధం

Car catches fire near telangana secretariat
  • గురువారం రాత్రి మెయిన్ రోడ్డులో ఘటన
  • ఒక్కసారిగా కారులో మంటలు
  • వెంటనే కారులో నుంచి దిగిన ప్రయాణికులు

తెలంగాణ సచివాలయానికి సమీపంలో ఓ కారు దగ్ధమైంది. మెయిన్ రోడ్డులో గురువారం రాత్రి కాసేపటి క్రితం ఈ ఘటన జరిగింది. కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో అందులో ప్రయాణిస్తున్న వారు వెంటనే కిందకు దిగారు. కారులో ఉన్న విలువైన వస్తువులను కూడా బయటకు తీశారు. కారు దగ్ధమైన సమయంలో రద్దీ ఎక్కువగా ఉంది. దీంతో ట్రాఫిక్ కాసేపు నిలిచిపోయింది. కారులో ఒక్కసారిగా మంటలు రావడంతో అందరూ భయానికి గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేసింది.

  • Loading...

More Telugu News