Singareni Collieries Company: ​సింగరేణి ఉద్యోగులకు శుభవార్త... రూ.1 కోటి ప్రమాద బీమా ఇచ్చేందుకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంగీకారం

Union Bank of India agreed to give Rs 1 cr insurance to Singareni employees
  • ఇప్పటివరకు సింగరేణి ఉద్యోగులకు రూ.40 లక్షల ప్రమాద బీమా
  • బ్యాంకు వర్గాలతో చర్చించిన సింగరేణి యాజమాన్యం
  • బీమా పెంచేందుకు సానుకూలంగా స్పందించిన బ్యాంకు
  • ఫిబ్రవరి 1 నుంచి రూ.1 కోటి బీమా వర్తింపు 
సింగరేణి ఉద్యోగులకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతా కలిగిన సింగరేణి ఉద్యోగులకు ఇకపై రూ.1 కోటి వరకు ప్రమాద బీమా లభించనుంది. ఆ మేరకు బ్యాంకు అంగీకరించింది. ఈ కొత్త బీమా పథకాన్ని ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి తీసుకురానున్నారు.  సింగరేణి సీఎండీ బలరాం ఆదేశాలతో సంస్థ అధికారులు బ్యాంకు వర్గాలతో చర్చించారు. ఇప్పటివరకు సింగరేణి ఉద్యోగులకు ప్రమాద బీమా రూ.40 లక్షలుగా ఉంది. తాజా చర్చల అనంతరం ఇప్పుడది కోటి రూపాయలకు పెరిగింది.
Singareni Collieries Company
Insurance
Employees
Union Bank Of India
Telangana

More Telugu News