Nara Bhuvaneswari: నేటి నుంచి నారా భువనేశ్వరి 'నిజం గెలవాలి' యాత్ర కొనసాగింపు

Nara Bhuvaneswari continues Nijam Gelavali yatra
  • చంద్రబాబు అరెస్ట్ అనంతరం మరణించినవారి కుటుంబాలకు పరామర్శ
  • తాజాగా మూడ్రోజుల పాటు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటన
  • మృతుల కుటుంబాలకు పరామర్శ... ఆర్థికసాయం
టీడీపీ అధినేత చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి నేటి నుంచి 'నిజం గెలవాలి' యాత్రను కొనసాగిస్తున్నారు. ఈ విడతలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 3 రోజుల పాటు నారా భువనేశ్వరి పర్యటించనున్నారు. స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అనంతరం మరణించినవారి కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు. 

నేడు జగ్గంపేట, పెద్దాపురం, తుని, కాకినాడలో పర్యటించనున్నారు. రేపు పి.గన్నవరం, అమలాపురం, రాజోలు, మండపేట, అనపర్తి నియోజకవర్గాల్లో పర్యటన ఉంటుంది. ఎల్లుండి అనపర్తి నిడదవోలు, కొవ్వూరు, రాజానగరంలో నారా భువనేశ్వరి పర్యటిస్తారు. మృతుల కుటుంబ సభ్యులకు ఆర్థికసాయం అందిస్తారు.
Nara Bhuvaneswari
Nijam Gelavali
TDP
Andhra Pradesh

More Telugu News