Ayodhya Ram Mandir: ఉదయం నుంచి 3 లక్షల మంది భక్తులకు బాలరాముడి దర్శనం

Around 3 lakh devotees take Ram Mandhir darshan
  • రామమందిరం వద్ద 8,000 మందికి పైగా భద్రతా సిబ్బంది
  • నేడు తెల్లవారుజామున 3 గంటలకు తెరుచుకున్న రామాలయం
  • 7 గంటల నుంచి భక్తులకు అనుమతి
  • బాలరాముడి దర్శనం కోసం వేచి చూస్తున్న మరో 3 లక్షలమంది భక్తులు

అయోధ్య బాలరాముడిని మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు దాదాపు 3 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ నిన్న జరిగింది. దీంతో రాములవారిని చూసేందుకు అయోధ్యకు దేశం నలుమూలల నుంచీ భక్తులు తరలి వస్తున్నారు. అయోధ్య రామమందిరం వద్ద 8,000 మందికి పైగా భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఇప్పటికిప్పుడు రాముడి దర్శనానికి రావొద్దని.. కాస్త సమయం తీసుకోవాలని ఆలయ పూజారులు, అధికారులు విజ్ఞప్తి చేశారు. 

నేటి నుంచి శ్రీరాముడి దర్శనానికి సాధారణ భక్తులకు అనుమతిస్తున్నారు. దీంతో బాలరాముడిని చూసేందుకు భక్తులు వరుస కడుతున్నారు. ఈ రోజు తెల్లవారుజామున 3 గంటలకే రాములోరి గుడి తెరుచుకుంది. 7 గంటల నుంచి భక్తులను అనుమతించారు. ఉదయం 2.5 నుంచి 3 లక్షల మంది దర్శించుకోగా... మరో 3 లక్షల మంది దర్శనం కోసం వేచి చూస్తున్నారు.

  • Loading...

More Telugu News