PM Rashtriya Bala Puraskar: కూచిపూడి నృత్యంలో ప్రతిభ కనబరుస్తున్న తెలంగాణ బాలికకు పీఎం రాష్ట్రీయ బాల పురస్కారం

PM Rashtriya Bala Puraskar to a Telangana girl who is showing talent in Kuchipudi dance
  • రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా అందుకున్న 14 ఏళ్ల పెండ్యాల లక్ష్మీ
  • కూచిపూడి నృత్యంలో ప్రతిభను గుర్తించి అవార్డు అందజేత
  • 9 మంది బాలురు, 9 మంది బాలికలకు పురస్కారాల ప్రదానం
తెలంగాణ బాలిక పెండ్యాల లక్ష్మీ ప్రియకు (14) ‘పీఎం రాష్ట్రీయ బాల పురస్కారం’ దక్కింది. కూచిపూడి నృత్య ప్రదర్శనలో ప్రతిభ కనబరుస్తున్నందున ఆమెకు ఈ అవార్డు దక్కింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా లక్ష్మీ ప్రియ బాల పురస్కారాన్ని స్వీకరించింది. ఆమెతో పాటు మరో 9 మంది బాలికలు, 9 మంది బాలురకు ఈ పురస్కారాలు లభించాయి. న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో వీరంతా అవార్డులు పొందారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలైన బాల, బాలికలను ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము మాట్లాడారు. ఏదో ఒక క్రీడలో ప్రావీణ్యం సాధించి మానసిక, శారీరక ఆరోగ్యంతోపాటు పోటీతత్వాన్ని మెరుగుపరచుకోవచ్చని సూచించారు.
PM Rashtriya Bala Puraskar
Kuchipudi dance
Pendyala Laxmi
Telangana

More Telugu News