ఒకేసారి ఐదు సినిమాలు ప్రారంభించి రికార్డు సృష్టించనున్న ఆర్సీ స్టూడియోస్ బ్యానర్!
- కన్నడ ఫిలింమేకర్ ఆర్.చంద్రు కొత్త వెంచర్ ఆర్సీ స్టూడియోస్
- రేపు బెంగళూరులో ఐదు సినిమాలకు ప్రారంభోత్సవం
- ఇటీవల 'కబ్జా'తో హిట్ కొట్టిన ఆర్సీ స్టూడియోస్
ఆర్సీ స్టూడియోస్ రేపు ఒకేసారి 5 సినిమాలను ప్రారంభిస్తోంది. భారతీయ చిత్ర పరిశ్రమలో ఒకే బ్యానర్‌తో ఒకేరోజు 5 సినిమాలను ప్రారంభించడం ఇదే తొలిసారి. ఈ చిత్రాలు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆనంద్ పండిట్, ఆనంద్ పండిట్ మోషన్ పిక్చర్స్, ముంబైకి చెందిన లోటస్ డెవలపర్స్ వంటి వారి చేతుల మీదుగా ప్రారంభం కానున్నాయి.
RC స్టూడియోస్ ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌ల కోసం సింగపూర్‌లోని ఇన్వెనియో ఆరిజిన్ కంపెనీకి చెందిన అలంకార్ పాండ్యన్, వ్యాపారవేత్త సీకల్ రామచంద్ర గౌడతో కలిసి నిర్మించనుంది. ఈ పాన్ ఇండియా సినిమాలపై RC స్టూడియోస్ 400 కోట్లకు పైగా పెట్టుబడి పెడుతున్నట్టు తెలుస్తోంది.
కన్నడ సీనియర్ హీరో ఉపేంద్ర కూడా ఈ సినిమాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరుకానున్నారు. మంగళవారం (జనవరి 23) సాయంత్రం 6:30 గంటలకు బెంగళూరులో ఈ కార్యక్రమం జరగనుంది.