Mahesh Babu: భార్య నమ్రతకు మహేశ్ బాబు బర్త్‌డే విషెస్.. ఇన్‌స్టాలో ఆసక్తికర పోస్ట్

Mahesh Babu birthday wishes for wife Namrata on Instagram
  • సోమవారం 53వ వసంతంలోకి అడుగుపెట్టిన నమ్రత
  • ‘ప్రేమతో నా ప్రతి రోజుని ఆనందంగా మార్చుతున్నావ్’ అంటూ నమ్రతకు మహేశ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు
  • ‘నువ్వు అందిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు’ ఇన్‌స్టాలో సితార పోస్ట్
టాలీవుడ్ ప్రిన్స్, సూపర్‌స్టార్ మహేశ్ బాబు తన భార్య నమ్రతకు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. ‘‘ ప్రేమ, అనుబంధంతో కూడిన మరో సంవత్సరానికి ధన్యవాదాలు’’ అంటూ రాసుకొచ్చాడు. నీ ప్రేమతో నా ప్రతి రోజుని ఆనందంగా మార్చుతున్నందుకు ధన్యవాదాలు. 2024ని ఆస్వాదించు’’ అంటూ విషెస్ తెలిపాడు. మూడు లవ్ ఎమోజీలను కూడా జోడించాడు. మహేశ్ పోస్టుపై పలువురు ఫ్యాన్స్‌ స్పందించారు. హ్యాపీ బర్త్‌డే అక్క అని కొందరు, వదిన అని కొందరు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

మరోవైపు కూతురు సితార కూడా నమ్రతకు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా శుభాకాంక్షలు తెలిపింది. "హ్యాపీ బర్త్‌డే అమ్మా! నువ్వు అందిస్తున్న ప్రేమ, ఆప్యాయత నిండిన కౌగిలింతలు, మధురమైన క్షణాలకు థ్యాంక్స్. మీ అంత ప్రత్యేకంగా మీ పుట్టిన రోజు కూడా ఉండాలని కోరుకుంటున్నాను. ఐ లవ్ యు సో మచ్‘’ అంటూ లవ్ ఎమోజీలను సితార జోడించింది. నమ్రతతో కలిసి ఉన్న ఫొటోలను ఆమె షేర్ చేసింది. 

కాగా సోమవారం (జనవరి 22) మహేశ్ భార్య నమ్రతా శిరోద్కర్ 53వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఆమెకు 52 ఏళ్లు నిండాయి. దీంతో ఆమెకు పలువురు సెలబ్రిటీలు బర్త్‌డే విషెస్ తెలిపారు.
Mahesh Babu
Namrata Birthday
Tollywood
Sitara

More Telugu News