YS Sharmila: దూకుడు పెంచుతున్న షర్మిల.. రేపటి నుంచి జిల్లాల పర్యటన

APCC Chief YS Sharmila district tour from tomorrow
  • కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యతను భుజాలపై వేసుకున్న షర్మిల
  • క్షేత్ర స్థాయిలో అందరినీ కలుపుకుని పోవడంపై దృష్టి
  • కొత్త, పాత తరం నేతల కలయికతో పార్టీని బలోపేతం చేయాలని యోచన
ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా బాధ్యతలను చేపట్టిన వైఎస్ షర్మిల దూకుడు పెంచుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యతలను భుజాలపై వేసుకున్న ఆమె... దానికి తగ్గట్టుగానే కార్యాచరణను సిద్ధం చేసుకున్నారు. క్షేత్ర స్థాయిలో అందరినీ కలుపుకుని పోవడం, కీలక నేతలను పార్టీలోకి తీసుకురావడం వంటి వాటిపై ప్రధానంగా ఆమె ఫోకస్ చేశారు. కొత్త, పాత తరం నేతల కలయికతో పార్టీని బలోపేతం చేయాలని ఆమె భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఆమె రేపటి నుంచి జిల్లాల యాత్రను చేపడుతున్నారు. రేపు శ్రీకాకుళం జిల్లా నుంచి ఆమె జిల్లాల పర్యటన ప్రారంభం కానుంది. 

షర్మిల జిల్లాల పర్యటన షెడ్యూల్:
  • జనవరి 23: శ్రీకాకుళం జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లా, విజయనగరం జిల్లా
  • జనవరి 24: విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జల్లాలు
  • 25వ తేదీ: కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాలు
  • 26వ తేదీ: తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలు
  • 27వ తేదీ: కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాలు
  • 28వ తేదీ: బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు
  • 29వ తేదీ:  తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలు
  • 30వ తేదీ: శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు జిల్లాలు
  • 31వ తేదీ: నంద్యాల, కడప జిల్లాలు. ఇడుపులపాయ చేరుకోవడంతో షర్మిల జిల్లాల పర్యటన ముగుస్తుంది. మరోవైపు వైసీపీ నేతలతో సీనియర్ నేత కేవీపీ రామచంద్రారావు చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.
YS Sharmila
Congress
Districts Visit
Andhra Pradesh

More Telugu News