Sitara: అనాథ బాలల కోసం 'గుంటూరు కారం' చిత్రాన్ని ప్రదర్శించిన ఘట్టమనేని సితార

Mahesh Babu daughter Sitara arranged Guntur Kaaram special screening for orphans
  • సామాజిక సేవలోనూ తనదైన ముద్ర వేస్తున్న మహేశ్ బాబు
  • తండ్రి బాటలోనే సితార
  • ఏఎంబీ సినిమాస్ లో అనాథ పిల్లల కోసం స్పెషల్ స్క్రీనింగ్
సూపర్ స్టార్ మహేశ్ బాబు తన సినిమాలతోనే కాదు సామాజిక సేవలతోనూ అభిమానుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు. ఆయన ఇప్పటికే ఆంధ్రా హాస్పిటల్స్ సౌజన్యంతో వందలాది చిన్నారులకు హృదయ సంబంధ శస్త్రచికిత్సలు చేయించి తన పెద్ద మనసు చాటుకున్నారు. రెండు గ్రామాలను కూడా దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్నారు. 

మహేశ్ బాబు ముద్దుల కుమార్తె ఘట్టమనేని సితార కూడా తండ్రి బాటలోనే సామాజిక స్పృహను ప్రదర్శిస్తోంది. మహేశ్ బాబు నటించిన గుంటూరు కారం చిత్రం ఈ సంక్రాంతికి రిలీజైన సంగతి తెలిసిందే. తాజాగా, అనాథ బాలల కోసం గుంటూరు కారం చిత్రాన్ని సితార ప్రత్యేకంగా ప్రదర్శించింది.

 హైదరాబాద్ లోని తమ సొంత థియేటర్ ఏఎంబీ సినిమాస్ లో ఈ స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేసింది. మహేశ్ బాబు ఫౌండేషన్-చీర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న అనాథ శరణాలయం పిల్లలతో కలిసి సితార గుంటూరు కారం సినిమాను వీక్షించింది. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో ఆకట్టుకుంటున్నాయి.
Sitara
Mahesh Babu
Guntur Kaaram
Orphans
Special Screening
AMB Cinemas
Hyderabad
Tollywood

More Telugu News