Rashmika Mandanna: ‘డీప్‌ ఫేక్‌ వీడియో’ నిందితుడి అరెస్టుపై నటి రష్మిక స్పందన

Rashmika mandanna responds to the news of deep fake video makers arrest
  • డీప్ ఫేక్ వీడియో కేసులో గుంటూరు యువకుడు ఈమని నవీన్ అరెస్టు
  • నిందితుడి అరెస్టుపై హర్షం వ్యక్తం చేసిన రష్మిక
  • పోలీసులకు ధన్యవాదాలు తెలిపిన వైనం
  • అనుమతి లేకుండా వ్యక్తిగత ఫొటోలు వాడితే నేరమని స్పష్టీకరణ
డీఫ్ ఫేక్ వీడియో నిందితుడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేయడంపై నటి రష్మిక హర్షం వ్యక్తం చేసింది. ‘‘ఢిల్లీ పోలీసులకు కృతజ్ఞతలు. ప్రేమతో నన్ను ఆదరించి, అన్ని రకాలుగా అండగా నిలిచేవారు నా చుట్టూ ఉన్నందుకు సంతోషిస్తున్నా. ఇలాంటి ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటారని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. యువతకు చెప్పేదొక్కటే.. అనుమతి తీసుకోకుండా మీ ఫొటోలను మార్ఫింగ్ చేసి ఎక్కడైనా ఉపయోగిస్తే అది నేరం’’ అని ఆమె ఎక్స్‌లో పోస్ట్ చేశారు. 

బిట్రీష్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ జారా పటేల్ వీడియోకు నిందితుడు కృత్రిమ మేధ సాయంతో రష్మిక ముఖాన్ని జోడించి వైరల్ చేసిన విషయం తెలిసిందే. ఈ వీడియోపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు మండిపడ్డారు. కృత్రిమ మేధ దుర్వినియోగమవుతున్న తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు.  ఈ ఘటనపై రష్మిక కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. 

మరోవైపు, వైరల్ వీడియోకు సంబంధించి ఢిల్లీ మహిళా కమిషన్ నుంచి పోలీసులకు నోటీసులు జారీ అయ్యాయి. గతేడాది నవంబర్ 10న కేసు నమోదైంది. ఈ క్రమంలో పోలీసులు ఏపీలోని గుంటూరుకు చెందిన ఈమని నవీన్‌ను (24) అరెస్టు చేశారు. రష్మిక పేరుతో ఫ్యాన్ పేజీ నడుపుతున్న నిందితుడు ఫాలోవర్ల సంఖ్య పెంచుకునేందుకు ఈ వీడియో తయారు చేసినట్టు గుర్తించారు.
Rashmika Mandanna
Andhra Pradesh
Deep Fake Video controversy
Tollywood
Deepfake

More Telugu News