komuravelli mallanna: కొమురవెల్లి మల్లన్న భక్తులకు మోదీ ప్రభుత్వం శుభవార్త

Railway halt sation for Komuravelli Mallanna temple
  • కొమురవెల్లి మల్లన్న హాల్ట్ స్టేషన్ కోసం కేంద్రానికి లేఖలు రాసినట్లు చెప్పిన కిషన్ రెడ్డి
  • త్వరలో కొమురవెల్లి మల్లన్న భక్తుల కోసం రైల్వే స్టేషన్‌కు శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడి
  • లకుడారం, దుద్దెడ స్టేషన్ల మధ్య కొత్త హాల్ట్ స్టేషన్
కొమురవెల్లి మల్లన్న భక్తులకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి శుభవార్త చెప్పారు. కొమురవెల్లి రైల్వే హాల్ట్ స్టేషన్ కోసం కేంద్రానికి పలుమార్లు లేఖలు రాశామని... అంగీకారం వచ్చిందని తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... మల్లన్న దేవాలయ దర్శనానికి వెళ్లేందుకు రైల్వే హాల్ట్ కోసం కేంద్రానికి లేఖలు రాసినట్లు తెలిపారు. ఇప్పుడు అనుమతులు రావడంతో త్వరలో కొమురవెల్లి స్టేషన్‌కు శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు. ప్రధాని నరేంద్రమోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

మనోహరాబాద్-కొత్తపల్లి మార్గంలో కొత్తగా కొమురవెల్లిలో రైల్వేస్టేషన్‌ను నిర్మించనున్నారు. భక్తులు ఎంతో కాలంగా విజ్ఞప్తి చేస్తుండటంతో సాధ్యాసాధ్యాలపై చర్చించిన రైల్వే శాఖ.. కొమురవెల్లి మల్లన్న జాతర సందర్భంగా రైల్వే హాల్ట్ స్టేషన్ నిర్మాణానికి అంగీకారం తెలిపింది. లకుడారం, దుద్దెడ స్టేషన్ల మధ్య కొమురవెల్లిలో కొత్త హాల్ట్ స్టేషన్ నిర్మాణానికి రైల్వే శాఖ పచ్చజెండా ఊపింది.
komuravelli mallanna
G. Kishan Reddy
BJP
Telangana

More Telugu News