laxman: హిందువుల మనోభావాలు దెబ్బతీస్తే ఊరుకోం: బీజేపీ నేత డాక్టర్ లక్ష్మణ్

Laxman warning to opposition parties
  • రామమందిరం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని విపక్షాలు రాజకీయం చేస్తున్నాయన్న లక్ష్మణ్  
  • మోదీ నిష్ఠతో మందిర నిర్మాణం చేపడితే ఓర్వలేకపోతున్నారని విమర్శ
  • బీజేపీ తరఫున మెగా స్క్రీన్ లలో ప్రదర్శన

హిందువుల మనోభావాలు దెబ్బతీస్తే ఊరుకునేది లేదని బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ హెచ్చరించారు. అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రధాని నరేంద్రమోదీ నిష్ఠతో మందిర నిర్మాణం చేపడితే ఓర్వలేకపోతున్నారని ఆరోపించారు. ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా జరగనున్న అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని మెగా స్క్రీన్‌లలో బీజేపీ తరఫున ప్రదర్శించనున్నట్లు తెలిపారు.

  • Loading...

More Telugu News