Gaddam Martin Luther Babu: అమరావతి దళిత జేఏసీ కన్వీనర్ లూథర్ మృతి

Amaravati Dalit JAC Convener Gaddam Martin Luther Babu passes away
  • నాలుగు రోజుల క్రితం గుండెపోటుకు గురైన లూథర్ బాబు
  • తాడేపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత
  • ఉద్యమం చివరి దశలో లూథర్ ను కోల్పోవడం దురదృష్టకరమన్న జేఏసీ నేతలు
అమరావతి దళిత జేఏసీ కన్వీనర్ గడ్డం మార్టిన్ లూథర్ బాబు మృతి చెందారు. నాలుగు రోజుల క్రితం ఆయన గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయనను తాడేపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన ఈ మధ్యాహ్నం కన్నుమూశారు. ఆయన ఇకలేరు అనే వార్తతో అమరావతి ప్రాంతం షాక్ కు గురయింది. లూథర్ మృతి అమరావతి ఉద్యమానికి తీరని లోటు అని జేఏసీ నేతలు అన్నారు. అమరావతి ఉద్యమాన్ని ముందుండి నడిపించారని... ఆయన చేసిన పోరాటం వృథా కాదని చెప్పారు. ఉద్యమం చివరి దశలో మార్టిన్ ను కోల్పోవడం దురదృష్టకరమని అన్నారు. ఆయన మృతి పట్ల పలువురు నేతలు సంతాపాన్ని తెలియజేస్తున్నారు.
Gaddam Martin Luther Babu
Amaravati
Dalit JAC

More Telugu News