Peddireddi Ramachandra Reddy: ఉరవకొండలో మంత్రి పెద్దిరెడ్డికి నిరసన సెగ... కాన్వాయ్ ను ముందుకు కదలనివ్వని అంగన్వాడీలు  

Anganwadi workers obstructs minister Peddireddy convoy in Uravakonda
  • ఈ నెల 23న ఉరవకొండలో సీఎం జగన్ పర్యటన
  • ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఉరవకొండ వచ్చిన మంత్రి పెద్దిరెడ్డి
  • పెద్దిరెడ్డి కాన్వాయ్ ను అడ్డుకున్న అంగన్వాడీలు
  • దాదాపు అరగంట సేపు తన వాహనంలోనే ఉండిపోయిన మంత్రి

ఉరవకొండలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి నిరసన సెగ తగిలింది. మంత్రి కాన్వాయ్ ని అంగన్వాడీ కార్యకర్తలు అడ్డుకున్నారు. పెద్దిరెడ్డి వాహనం ముందు బైఠాయించి వారు నిరసన తెలిపారు. 

ఈ నెల 23న అనంతపురం జిల్లా ఉరవకొండలో సీఎం జగన్ పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన, సభ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు మంత్రి పెద్దిరెడ్డి ఉరవకొండ వచ్చారు. 

ఈ నేపథ్యంలో, ఆయన కాన్వాయ్ ను ముందుకు వెళ్లనివ్వకుండా అడ్డుకున్న అంగన్వాడీలు అరగంట సేపు ఆందోళన చేపట్టారు. దాంతో, మంత్రి పెద్దిరెడ్డి తన వాహనంలోనే రోడ్డుపై ఉండిపోవాల్సి వచ్చింది. ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. ఈ దశలో పోలీసులు అంగన్వాడీ కార్యకర్తలను బలవంతంగా ఇవతలకు లాగేశారు. దాంతో, మంత్రి పెద్దిరెడ్డి కాన్వాయ్ ముందుకు కదిలింది.

  • Loading...

More Telugu News