Sachin Tendulkar: మళ్లీ ఫామ్‌లోకి సచిన్ టెండూల్కర్.. వీడియో చూడండి!

Sachin takes one wicket and made 27 runs in exhibition match
  • ‘వన్ వరల్డ్’ వర్సెస్ ‘వన్ ఫ్యామిలీ’ ఎగ్జిబిషన్ మ్యాచ్‌
  • యువీ సారథ్యంలోని వన్ ఫ్యామిలీ జట్టుపై సచిన్ సారథ్యంలోని వన్ వరల్డ్ జట్టు విజయం
  • 27 పరుగులు చేసి ఒక వికెట్ పడగొట్టిన సచిన్

అదేంటి సచిన్ ఫామ్‌లోకి రావడమేంటి? ఆయన క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి ఏళ్లు గడిచిపోయింది కదా! అనుకుంటున్నారా? అదీ నిజమే.. ఇదీ నిజమే! ‘వన్ వరల్డ్’ వర్సెస్ ‘వన్ ఫ్యామిలీ’ ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో సచిన్ ఓ వికెట్ తీసుకోవడంతోపాటు 16 బంతుల్లో 27 పరుగులు చేసి అభిమానుల మనసులను మరోమారు దోచుకున్నాడు. క్రీజులో ఉన్నంతసేపు తన ట్రేడ్‌మార్క్ షాట్లతో ఉర్రూతలూగించాడు. చక్కని టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. చివరికి ముత్తయ్య మురళీధరన్ బౌలింగ్‌లో తొలి బంతికే అవుటై పెవిలియన్ చేరడంతో అభిమానులు నిరాశ చెందారు. 

యువరాజ్‌సింగ్ సారథ్యంలోని వన్ ఫ్యామిలీ జట్టుపై సచిన్ సారథ్యంలోని వన్ వరల్డ్ జట్టు నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఏడు దేశాలకు చెందిన 24 మంది దిగ్గజ ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లో మరోమారు అలరించారు.

  • Loading...

More Telugu News