Manipur: మణిపూర్‌లో మళ్లీ మొదలైన హింస.. ఏడుగురి మృతి

7 killed in fresh violence in Manipur
  • గత కొన్ని రోజులుగా ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో మళ్లీ హింస  
  • మృతుల్లో ఇద్దరు పోలీసులు.. ఒక విలేజ్ వలంటీర్
  • భయంభయంగా గడుపుతున్న ప్రజలు
గత కొన్ని రోజులుగా ప్రశాంతంగా ఉన్న మణిపూర్‌లో హింస మళ్లీ మొదలైంది. బిష్ణుపూర్ జిల్లాల్లో గురువారం మరో నలుగురు హత్యకు గురయ్యారు. వీరితో కలుపుకొని తాజా హింసలో మృతి చెందిన వారి సంఖ్య ఏడుకు పెరిగింది. వీరిలో ఇద్దరు పోలీసులు కూడా ఉన్నారు. మోరే గ్రామంలో సాయుధ మిలిటెంట్లు వీరిని కాల్చి చంపారు. మరో గ్రామంలో దుండగులతో జరిగిన ఎదురుకాల్పుల్లో విలేజ్ వలంటీర్ మృతి చెందాడు.

రిజర్వేషన్ల విషయంలో కుకీలు, మెయిటీలకు మధ్య రేకెత్తిన అల్లర్లతో అల్లకల్లోలంగా మారిన మణిపూర్‌లో ఇటీవల జరిగిన ఘర్షణల్లో 175 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయపడ్డారు. ఆ తర్వాత కొన్ని రోజులపాటు ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో మళ్లీ ఘర్షణలు మొదలయ్యాయి. తాజాగా గత 48 గంటల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. తాజా ఘర్షణల నేపథ్యంలో ప్రజలు భయంభయంగా గడుపుతున్నారు.
Manipur
Manipur Violence
Kuki
Meitei people

More Telugu News