Mallu Bhatti Vikramarka: ఖమ్మం నుంచి లోక్ సభకు పోటీ చేస్తానన్న మల్లు భట్టి భార్య... తనకు మాత్రమే హక్కు ఉందన్న రేణుకా చౌదరి!

Mallu Bhatti wife versus Renuka chowdhary on Khammam Lok sabha
  • ప్రచారం జరుగుతున్న మాట వాస్తవమేనన్న భట్టి భార్య నందిని 
  • ప్రజలు తనను ఖమ్మం ఎంపీ కావాలని కోరుకుంటున్నారని వ్యాఖ్య
  • కొత్తగా వచ్చిన వాళ్లు చెప్పేవన్నీ కథలేనన్న రేణుక 

ఖమ్మం లోక్ సభ సీటుపై కాంగ్రెస్ పార్టీలో గట్టి పోటీ కనిపిస్తోంది. పలువురు పోటీకి సై అంటున్నారు. తాజాగా, రానున్న లోక్ సభ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క భార్య నందిని ఓ ఇంటర్వ్యూలో చెప్పగా.. తనకే హక్కు ఉందని కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి కౌంటర్ ఇచ్చారు. 

మల్లు భట్టి భార్య నందిని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... తాను ఖమ్మం పార్లమెంట్ బరిలో నిలుస్తానంటూ ప్రచారం జరుగుతున్న మాట వాస్తవమేనని.. అది ప్రజల నుంచి వచ్చిన ప్రచారమని... దానిని ఎవరూ ఆపలేరన్నారు. ప్రజలు తనను ఖమ్మం ఎంపీ కావాలని కోరుకుంటున్నారని... పోటీ చేస్తానని వ్యాఖ్యానించారు. 

ఈ వ్యాఖ్యలపై రేణుకా చౌదరి స్పందించారు. ఖమ్మం నుంచి లోక్ సభకు పోటీ చేసే హక్కు తనకు మాత్రమే ఉందన్నారు. కొత్తగా వచ్చిన వాళ్లు చెప్పేవి అన్నీ కథలేనని.. అవేవీ నమ్మవద్దన్నారు. రేణుకా చౌదరి కోరుకున్నదంటే కాదనే శక్తి ఎవరికీ లేదని ఆమె వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News