ఆసుపత్రిలో తమ్మినేని వీరభద్రంను పరామర్శించిన మల్లు భట్టివిక్రమార్క, పొంగులేటి
- మల్లు భట్టి, పొంగులేటితో పాటు కోమటిరెడ్డి తదితరుల పరామర్శ
- సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకొని ప్రజాక్షేత్రంలోకి రావాలన్న భట్టి
- ఆరోగ్యంపై డాక్టర్లను అడిగి తెలుసుకున్న మంత్రులు
రెండు రోజుల క్రితం ఖమ్మంలోని నివాసంలో తమ్మినేని వీరభద్రం ఛాతినొప్పితో ప్రయివేటు ఆసుపత్రిలో చేరారు. అక్కడి నుంచి హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ఆయనకు రెండు రోజులుగా ఆసుపత్రి వర్గాలు చికిత్సను అందిస్తున్నాయి. ఈ క్రమంలో పలువురు రాజకీయ ప్రముఖులు వచ్చి ఆయనను పరామర్శిస్తున్నారు.