NTR 28th Death Anniversary: ఎన్టీఆర్ యుగపురుషుడు.. ఏపీ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు: నారా భువనేశ్వరి

Nara Bhuvaneswari Tributes To His Father NTR On His Death Anniversary
  • నేడు ఎన్టీఆర్ 28వ వర్ధంతి
  • ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులు అర్పించిన భువనేశ్వరి
  • ఎన్టీఆర్ భవన్‌లో లోకేశ్ నివాళి

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ 28వ వర్ధంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులు అర్పించారు. ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకున్న నారా భువనేశ్వరి తండ్రికి నివాళులు అర్పించారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఎన్టీఆర్ యుగపురుషుడని కీర్తించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎన్టీఆర్ ఎంతగానో కృషి చేసినట్టు చెప్పారు. సినిమా రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని కొనియాడారు. 

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎన్టీఆర్ భవన్‌లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పలువురు నేతలు, కార్యకర్తలు విగ్రహంపై పూలు చల్లి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తి కృష్ణుడి వేషధారణలో అచ్చం ఎన్టీఆర్‌ను తలపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

  • Loading...

More Telugu News