Rohit Sharma: సెంచరీతో చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. టీ20 ఫార్మాట్‌లో అసాధారణ రికార్డు

Rohit Sharma created history in the T20 format with a century against Afghanistan
  • టీ20 ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా నిలిచిన హిట్‌మ్యాన్
  • 5 సెంచరీలతో అగ్రస్థానంలో నిలిచిన రోహిత్ శర్మ
  • కోహ్లీని అధిగమించి టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత్ కెప్టెన్‌గా అవతరణ

బెంగళూరు వేదికగా బుధవారం ఆఫ్ఘనిస్థాన్‌‌తో జరిగిన మూడవ టీ20 మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సంచలన రికార్డు నెలకొల్పాడు. టీ20 ఫార్మాట్ క్రికెట్‌లో 5 సెంచరీలు నెలకొల్పిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా హిట్‌మ్యాన్ అవతరించాడు. ఈ విషయంలో మ్యాక్స్‌వెల్, సూర్యకుమార్ యాదవ్‌లను అధిగమించాడు. అంతేకాకుండా టీ20 ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత్ కెప్టెన్‌గా రోహిత్ నిలిచాడు. ఈ విషయంలో 1570 పరుగులతో ఇప్పటివరకు టాప్ ప్లేస్‌లో ఉన్న విరాట్‌ను దాటేశాడు. 

కాగా ఆఫ్ఘనిస్థాన్‌పై మూడవ టీ20లో రోహిత్ శర్మ చెలరేగి ఆడాడు. 69 బంతుల్లో 121 పరుగులు కొట్టి నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో 11 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. మిగతా బ్యాటర్లు స్వల్ప స్కోరుకే వెనుదిరిగినప్పటికీ రోహిత్ కడదాకా క్రీజులో ఉన్నాడు. దీంతో 2018లో లక్నో వేదికగా వెస్టిండీస్‌పై సెంచరీ తర్వాత రోహిత్‌ మరో టీ20 సెంచరీ అందుకున్నాడు. ఇక 2017లో ఇండోర్‌లో శ్రీలంకపై చేసిన 118 పరుగుల అత్యధిక స్కోరును ఆఫ్ఘనిస్థాన్‌పై రోహిత్ అధిగమించాడు.

బెంగళూరు టీ20లో భారత్ ఘనవిజయం సాధించింది. మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్‌కు దారితీసింది. సూపర్ ఓవర్ కూడా టై అవ్వడంతో రెండో సూపర్ ఓవర్‌లో ఫలితం తేలిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News