Sankranti: ఏపీలో స్కూళ్లకు సంక్రాంతి సెలవుల పొడిగింపు

AP Govt extends Sankranti holidays for schools
  • జనవరి 18తో ముగియనున్న సెలవులు
  • తాజాగా మరో మూడ్రోజుల పొడిగింపు
  • జనవరి 22న స్కూళ్ల పునఃప్రారంభం
  • టీచర్లు, తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు నిర్ణయం తీసుకున్నామన్న విద్యాశాఖ
ఏపీలో స్కూళ్లకు సంక్రాంతి సెలవులు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ఏపీలో స్కూళ్లు సంక్రాంతి సెలవుల అనంతరం జనవరి 19న ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, సెలవులను మరో మూడ్రోజులు పొడిగిస్తున్నట్టు రాష్ట్ర విద్యాశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. రాష్ట్రంలో పాఠశాలలు జనవరి 22న పునఃప్రారంభం అవుతాయని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేశ్ కుమార్ పేర్కొన్నారు. టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రుల విజ్ఞప్తుల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది.
Sankranti
Holidays
Schools
Andhra Pradesh

More Telugu News