IPS Officers: తెలంగాణ, ఏపీలకు ఐపీఎస్ ల కేటాయింపు

New IPS officers to AP and Telangana
  • తెలంగాణకు ఆరుగురు ఐపీఎస్ ల కేటాయింపు
  • ఏపీకి ముగ్గురు అధికారుల కేటాయింపు
  • వీరంతా 2022 బ్యాచ్ కు చెందిన అధికారులు
ఇరు తెలుగు రాష్ట్రాలకు కొత్త ఐపీఎస్ అధికారులను కేటాయిస్తూ కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణకు ఆరుగురు, ఏపీకి ముగ్గురు అధికారులను కేటాయించారు. వీరంతా 2022 బ్యాచ్ కు చెందినవారు. తెలంగాణకు కేటాయించిన ఐపీఎస్ అధికారుల్లో సాయి కిరణ్, రాహుల్ కాంత్, రుత్విక్ సాయి, మంధారే సోహం సునీల్, ఆయేషా ఫాతిమా, మనన్ భట్ ఉన్నారు. ఏపీకి కేటాయించిన అధికారుల పేర్లపై స్పష్టత రావాల్సి ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఢిల్లీలో పర్యటించినప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. తెలంగాణకు అదనంగా ఐపీఎస్ అధికారులను కేటాయించాలని ఈ సందర్భంగా అమిత్ షాను రేవంత్ కోరారు.
IPS Officers
Telangana
Andhra Pradesh

More Telugu News