YS Sunitha: వైసీపీకి మరో షాక్.. కాంగ్రెస్ లో చేరుతున్న వైఎస్ సునీత

YS Sunitha to join Congress
  • ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల నియామకం
  • సోదరి పార్టీలో చేరబోతున్న సునీత
  • పులివెందుల శాసనసభ లేదా కడప లోక్ సభకు పోటీ చేసే అవకాశం
ఏపీ రాజకీయాల్లో మరో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకోబోతోంది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీత ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఆమె చేరబోతున్నారు. తన సోదరి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలిగా నియమితులు కావడంతో సునీత కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయంచుకున్నారు. 

పార్టీ ఆదేశిస్తే వచ్చే ఎన్నికల్లో పులివెందుల నుంచి శాసనసభకు లేదంటే కడప నుంచి లోక్ సభకు పోటీ చేయాలని సునీత భావిస్తున్నట్టు సమాచారం. వైఎస్ వివేకా హత్యకు సంబంధించిన కోర్టు కేసుల్లో సునీత ఇంప్లీడ్ అయ్యారు. తన తండ్రిని చంపిన వారికి కఠిన శిక్షలు పడాలని ఆమె న్యాయ పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నారు. వైసీపీ టార్గెట్ గా ఆమె కాంగ్రెస్ లో చేరుతున్నారు.
YS Sunitha
YS Sharmila
Congress

More Telugu News