bv raghavulu: తమ్మినేని వీరభద్రం వేగంగా కోలుకుంటున్నారు: బీవీ రాఘవులు

BV Raghavulu meets Tammineni Veerabhadram in Hospital
  • ఏఐజీ ఆసుపత్రిలో వీరభద్రంను పరామర్శించిన రాఘవులు
  • ఆరోగ్య పరిస్థితి వేగంగా మెరుగుపడుతోందని వెల్లడి
  • మరో రెండు రోజుల్లో పూర్తిగా కోలుకుంటారని డాక్టర్లు చెప్పారని వ్యాఖ్య

సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వేగంగా కోలుకుంటున్నారని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమ్మినేనిని బుధవారం ఆయన పరామర్శించారు. 

అనంతరం రాఘవులు మీడియాతో మాట్లాడుతూ... తాను డాక్టర్లతోనూ మాట్లాడానన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి వేగంగా మెరుగుపడుతోందన్నారు. హృద్రోగ సంబంధ సమస్యలతో ఆయన ఆసుపత్రిలో చేరారన్నారు. నిపుణులైన డాక్టర్లు ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. మరో రెండు రోజుల్లో ఆయన పూర్తిగా కోలుకుంటారని వైద్యులు చెప్పారన్నారు. ఆయన త్వరగా కోలుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

  • Loading...

More Telugu News