Gautam Adani: తెలంగాణలో రూ.12,400 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న అదానీ గ్రూప్

Adani Group to invest Rs 12400 crore in Telangana
  • 1350 మెగావాట్ల సామర్థ్యంతో రెండు పంప్ద్ స్టోరేజీ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్న అదానీ గ్రీన్ ఎనర్జీ
  • 100 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ క్యాంపస్‌ను ఏర్పాటు చేయనున్న అదానీకాన్‌ఎక్స్
  • అన్ని విధాలా సహకరిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి   
దావోస్‌లోని వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్‌లో బుధవారం (జనవరి 17) అదానీ గ్రూప్‌తో తెలంగాణ ప్రభుత్వం నాలుగు అవగాహన (ఎంవోయూ) ఒప్పందాలు కుదుర్చుకుంది. రానున్న కొన్నేళ్లలో తెలంగాణలో రూ.12,400 కోట్ల రూపాయల పెట్టుబడులు పెడతామని అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలిపారు. తెలంగాణలో 1350 మెగావాట్ల సామర్థ్యంతో రెండు పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులను ఏర్పాటు చేసేందుకు అదానీ గ్రీన్ ఎనర్జీ రూ.5,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. చందన్‌వెల్లిలో మొత్తం 100 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ క్యాంపస్‌ను ఏర్పాటు చేసేందుకు అదానీకాన్ఎక్స్ డేటా సెంటర్ మరో రూ.5,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది.

అంబుజా సిమెంట్స్ లిమిటెడ్ తెలంగాణలోని సిమెంట్ గ్రైండింగ్ యూనిట్‌లో రూ.1,400 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. అదానీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్, మిస్సైల్ డెవలప్‌మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్లలో రూ.1,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది.

తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడిదారులకు అనుకూలమైనదని... ప్రణాళికాబద్ధమైన విధానాలతో చాలా పెట్టుబడులను ఆకర్షిస్తోందని గౌతమ్ అదానీ అన్నారు. తెలంగాణలో అదానీ గ్రూప్ వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రాజెక్టులకు అవసరమైన సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు, సహాయ సహకారాలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
Gautam Adani
Revanth Reddy
Telangana
Congress

More Telugu News