Iran: పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై క్షిపణులతో విరుచుకుపడ్డ ఇరాన్

Iran attacked terrorist bases in Pakistan with missiles
  • బలూచిస్థాన్‌లోని జైష్ అల్-అద్ల్‌ స్థావరాలను ధ్వంసం చేసిన ఇరాన్
  • క్షిపణులు, డ్రోన్‌లను ఉపయోగించి దాడులు.. ప్రధాన కార్యాలయాల ధ్వంసం
  • జైష్ అల్-అద్ల్‌‌ను ఉగ్రసంస్థగా ప్రకటించిన ఇరాన్

పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ విరుచుకుపడింది. భారీ క్షిపణులు, డ్రోన్‌లతో మంగళవారం మెరుపుదాడులు చేసింది. పాక్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో సరిహద్దుల వెంబడి ఉగ్ర కార్యకలాపాలు నిర్వహిస్తున్న తీవ్రవాద సంస్థ జైష్ అల్-అద్ల్‌ స్థావరాలే టార్గెట్‌గా ఈ దాడులు చేసింది. క్షిపణులు, డ్రోన్లను ఉపయోగించి చేసిన ఈ దాడుల్లో రెండు ప్రధానమైన బేస్‌లు ధ్వంసమయ్యాయని ఇరాన్ ప్రభుత్వ మీడియా సంస్థ ఐఆర్ఎన్ఏ తెలిపింది. సంస్థకు చెందిన అతిపెద్ద కార్యాలయం ధ్వంసమైందని తెలిపింది. అయితే పాకిస్థాన్ ఈ దాడిని ఇంకా అంగీకరించలేదు. కాగా సున్నీ మిలిటెంట్ గ్రూప్ అయిన ‘జైష్ అల్-అద్ల్’ పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

కాగా 2012లో ఏర్పడిన జైష్ అల్-అద్ల్‌‌ను ఇరాన్ ఉగ్రవాద సంస్థగా గుర్తించింది. కొన్నేళ్ల వ్యవధిలో ఇరాన్ భద్రతా బలగాలపై దాడులకు పాల్పడిన చరిత్ర ఉండడంతో దీనిని ఉగ్రసంస్థగా ప్రకటించింది. కాగా ఇరాక్‌లోని కుర్దిష్ ప్రాంతంలో ఉన్న ఇజ్రాయెల్ గూఢచార ప్రధాన కార్యాలయంపై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ దాడి చేసిన రోజే పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలపై దాడులు జరగడం గమనార్హం.
Iran
Pakistan
Jaish al Adl
Balochistan

More Telugu News