Mega Family: సంక్రాంతి సంబరాలు ముగించుకుని హైదరాబాద్ తిరిగొచ్చిన మెగా ఫ్యామిలీ

Mega family back to Hyderabad from Bengaluru after Sankranti celebrations
  • సంక్రాంతి వేడుకల కోసం బెంగళూరు వెళ్లిన మెగా, అల్లు కుటుంబాలు
  • ఫాంహౌస్ లో అంబరాన్నంటిన సంబరాలు
  • నేడు హైదరాబాద్ ఎయిర్ పోర్టులో దర్శనమిచ్చిన మెగా ఫ్యామిలీ
ఈ సంక్రాంతికి మెగా, అల్లు వారి కుటుంబ సభ్యులు బెంగళూరు వెళ్లి అక్కడి ఫాంహౌస్ లో సంబరాలు జరుపుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి, సురేఖ, అంజనా దేవి, రామ్ చరణ్, ఉపాసన, క్లీంకార, అల్లు అరవింద్, నాగబాబు, అల్లు అర్జున్, స్నేహారెడ్డి, వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, సాయితేజ్, వైష్ణవ్ తేజ్, సుస్మిత, శ్రీజ, నిహారిక, అకీరా, ఆద్య, చిరంజీవి చెల్లెమ్మలు... ఇలా మెగా, అల్లు ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఒక్క చోట చేరి హాయిగా ఎంజాయ్ చేశారు. 

నేటితో సంక్రాంతి సంబరాలు ముగియడంతో బెంగళూరు నుంచి అందరూ తిరుగుపయనమయ్యారు. చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్, ఉపాసన ఈ సాయంత్రం హైదరాబాదుకు తిరిగొచ్చారు. ఎయిర్ పోర్టులో వారిని కెమెరాలు క్లిక్ మనిపించాయి. 

కాగా, చిరంజీవి 156వ చిత్రం 'విశ్వంభర' ప్రస్తుతం సెట్స్ పై ఉంది. వెకేషన్ ముగియడంతో ఆయన కూడా చిత్రీకరణలో పాల్గొననున్నారు. 'బింబిసార' ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'విశ్వంభర' చిత్రం ప్రస్తుతం మారేడుమిల్లి ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటోంది. 

ఇక, రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో 'గేమ్ చేంజర్' చిత్రంలో నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కుతున్న 'గేమ్ చేంజర్' పై భారీ అంచనాలు ఉన్నాయి. 'గేమ్ చేంజర్' చిత్రం పూర్తయితే, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో క్రీడా నేపథ్యం ఉన్న సినిమాలో రామ్ చరణ్ నటించనున్నారు.
Mega Family
Sankranti
Chiranjeevi
Ramcharan
Upasana
Hyderabad
Bengaluru
Tollywood

More Telugu News