shanthi kumari: కార్పొరేషన్లు, బోర్డులలో పని చేస్తోన్న రిటైర్డ్ ఉద్యోగుల వివరాలు ఇవ్వండి: తెలంగాణ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు

Telangana cs asked for details of retired officers who are working
  • రిటైర్డ్ ఉద్యోగులను వివిధ స్థాయులలో నియమించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం
  • వివిధ శాఖలు, కార్పొరేషన్లు, బోర్డులలో పని చేస్తోన్న రిటైర్డ్ అధికారుల వివరాలు ఇవ్వాలని ఆదేశం
  • ఈ అంశాన్ని అత్యవసరంగా పరిగణించి రేపు సాయంత్రం ఐదు గంటలలోగా ఇవ్వాలని ఆదేశం
వివిధ స్థాయులలో పనిచేస్తోన్న మాజీ అధికారుల వివరాలు సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పదవీ విరమణ పొందిన పలువురు అధికారులను గత ప్రభుత్వం వివిధ స్థాయులలో నియమించింది. ఇలా పదవీ విరమణ తర్వాత కూడా వివిధ హోదాల్లో కొనసాగుతున్న వారిపై ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ శాఖలు, కార్పొరేషన్లు, బోర్డులలో పని చేస్తోన్న వారి వివరాలను ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ అంశాన్ని అత్యవసరంగా పరిగణించి బుధవారం సాయంత్రం ఐదు గంటలలోపు నిర్ణీత నమూనాలో వివరాలు ఇవ్వాలని ముఖ్య కార్యదర్శులు, శాఖాధిపతులను ఆదేశించారు.

shanthi kumari
Telangana
Congress
BRS

More Telugu News