Komatireddy Venkat Reddy: తెలంగాణ ఏర్పాటులో జైపాల్ రెడ్డిది కీలక పాత్ర: మంత్రి కోమటిరెడ్డి

Minister Komatireddy Venkat Reddy says Jaipal Reddy played key role in telangana
  • నెక్లెస్ రోడ్డులోని స్ఫూర్తి స్థల్ వద్ద జైపాల్ రెడ్డి జయంతిలో పాల్గొన్న మంత్రి
  • తెలంగాణను తప్పకుండా సాధిస్తామని ఉద్యమం సమయంలో ధైర్యం చెప్పేవారన్న కోమటిరెడ్డి
  • ప్రతిపక్షాలు కూడా వేలెత్తి చూపకుండా జైపాల్ రెడ్డి పని చేశారని కితాబు

తెలంగాణ ఏర్పాటులో జైపాల్ రెడ్డి కీలక పాత్ర పోషించారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నెక్లెస్ రోడ్డులోని స్ఫూర్తి స్థల్ వద్ద జైపాల్ రెడ్డి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం నాటి ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఒప్పించడంలో జైపాల్ రెడ్డి పాత్ర ఎంతో ఉందన్నారు. తెలంగాణ తప్పకుండా సాధిస్తామని... ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని ఉద్యమకారులకు, నాయకులకు జైపాల్ రెడ్డి పదేపదే చెప్పేవారని గుర్తు చేశారు.

హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తారనే అభిప్రాయం చాలామందిలో ఉండేదని, కానీ జైపాల్ రెడ్డి మాత్రం అలా ఏమాత్రం కాబోదని ధైర్యం చెప్పేవారన్నారు. తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ కూడా ప్రతిపక్షాలు వేలెత్తి చూపకుండా పని చేశారన్నారు. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టే విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

  • Loading...

More Telugu News