Rakul Preet Singh: పెళ్లి పుకార్ల నేపథ్యంలో జాకీ భగ్నానితో రిలేషన్‌షిప్‌పై నోరు విప్పిన రకుల్ ప్రీత్ సింగ్

Rakul Preet Singh opens up about her relationship with Jackie Bhagnani amid marriage rumours
  • చాలా కాలంగా సింగిల్‌గా ఉన్నానంటూ క్లారిటీ ఇచ్చిన అమ్మడు
  • సినీ ఇండస్ట్రీకి చెందినవారిపై చాలా ప్రచారాలు జరుగుతుంటాయని వ్యాఖ్య
  • ఒకే ఇండస్ట్రీకి చెందినవారం కావడంతో జాకీ అర్థం చేసుకునేవాడని తెలిపిన రకుల్ ప్రీత్ సింగ్

గత కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్న నటి రకుల్ ప్రీత్ సింగ్, నటుడు జాకీ భగ్నాని ఈ ఏడాది మార్చిలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ  పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే ఈ ప్రచారంపై రకుల్ క్లారిటీ ఇచ్చింది. చాలా కాలంగా సింగిల్‌గా ఉన్నానని ఆమె చెప్పారు. భాగస్వామిని కలిగివుండడం ఒక సహజ ప్రక్రియ అని, అయితే దురదృష్టవశాత్తూ సినీ ఇండస్ట్రీలో ఉండేవారిపై చాలా ప్రచారాలు జరుగుతుంటాయని ఆమె చెప్పారు. సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ మనుషులమేనని, అందరికీ భావోద్వేగాలు, బాధలు ఉంటాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

జాకీతో ఎమోషనల్ బ్యాలెన్స్‌పై స్పందిస్తూ ఇద్దరం సినిమా రంగానికి చెందినవారమేనని రకుల్ పేర్కొంది. తాను స్వతంత్రంగా వ్యవహరించే అమ్మాయినే అయినప్పటికీ, జాకీ వద్దకు వెళ్లి ఎక్కువసేపు మాట్లాడిన రోజులు కూడా ఉన్నాయని తెలిపింది. సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తే కావడంతో జాకీ  తనను అర్థం చేసుకునేవాడని తెలిపింది. తామిద్దరం ఎప్పుడూ సినిమాకి సంబంధించిన విషయాలనే కాకుండా ఇతర అంశాల గురించి కూడా మాట్లాడుకునేవాళ్లమని చెప్పారు. ఫిట్‌నెస్‌కు సంబంధించిన అంశాలపై దృష్టి సారించేవారిమని చెప్పారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఈ మేరకు వ్యక్తిగత జీవితానికి సంబంధించి తన ఆలోచనలను పంచుకున్నారు.

  • Loading...

More Telugu News