G. Kishan Reddy: కోటిపల్లిలో బోటింగ్‌తో సందడి చేసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి... ఇదిగో వీడియో

G Kishan Reddy rafts a boat at Kotepally Reservoir
  • కోటిపల్లి రిజర్వాయర్‌ను సందర్శించిన కిషన్ రెడ్డి
  • అనంతగిరి పర్యాటక కేంద్రానికి రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పిన కిషన్ రెడ్డి
  • పెద్దేమూల్ మండలం చైతన్యనగర్ గ్రామంలో పీఎం జన్ మన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్రమంత్రి
కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి బోటింగ్‌తో సందడి చేశారు. సోమవారం ఆయన వికారాబాద్ జిల్లాలో పర్యటించారు. జిల్లాలోని కోటిపల్లి రిజర్వాయర్‌ను సందర్శించిన కిషన్ రెడ్డి సరదాగా బోటింగ్ చేశారు. 

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... అనంతగిరి పర్యాటక కేంద్రానికి రూ.100 కోట్లు కేటాయించనున్నట్లు చెప్పారు. త్వరలో పనులను ప్రారంభిస్తామన్నారు. ప్రయివేటు రంగాల నుంచి పెట్టుబడులను తీసుకువచ్చి పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ప్రపంచంలో చాలా దేశాలు పర్యాటక రంగంతో అభివృద్ధి చెందుతున్నాయని... భారత్‌కు ఎన్నో అవకాశాలు ఉన్నాయన్నారు. పర్యాటక రంగానికి ఊతమిచ్చేందుకు ప్రయివేటు పెట్టుబడులు రావాలన్నారు. 

'పీఎం జన్ మన్' పథకాన్ని ప్రారంభించిన కిషన్ రెడ్డి

కిషన్ రెడ్డి అంతకుముందు 'పీఎం జన్ మన్' కార్యక్రమాన్ని ప్రారంభించారు. పెద్దేమూల్ మండలంలోని చైతన్యనగర్ గ్రామంలో ఉదయం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. చెంచులకు, ఆదివాసీలకు కావాల్సిన 11 రకాల కనీస సౌకర్యాలను కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని తీసుకువచ్చినట్టు చెప్పారు. దేశవ్యాప్తంగా ఆదివాసీల కోసం కేంద్రం ఈ పథకాన్ని ప్రారంభించిందన్నారు.
G. Kishan Reddy
Telangana
BJP

More Telugu News