kiran kumar reddy: కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడంపై పీసీసీ ఉపాధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి స్పందన

Kiran kumar Reddy responds on ED notices to Kavitha
  • కవితకు నోటీసుల పేరుతో బీజేపీ డ్రామాకు తెరలేపిందని విసుర్లు
  • లోక్ సభ ఎన్నికల్లో లబ్ది పొందేందుకే ఈడీ సమన్లు అని ఆరోపణ
  • బీజేపీ, బీఆర్ఎస్ ఎన్ని డ్రామాలు ఆడినా విశ్వసించరన్న కాంగ్రెస్ నేత
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు జారీ చేసిన అంశంపై టీపీసీసీ ఉపాధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. లోక్ సభ ఎన్నికలకు ముందు కవితకు నోటీసుల పేరుతో బీజేపీ పెద్ద డ్రామాకు తెరలేపిందని విమర్శించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో లబ్ది పొందేందుకే ఈడీతో సమన్లు పంపించిందని ఆరోపించారు. ఢిల్లీ మద్యం కేసులో కవితపై ఇన్ని రోజులుగా కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదనే విషయం ప్రజలందరికీ తెలుసునని వ్యాఖ్యానించారు. బీజేపీ, బీఆర్ఎస్ ఎన్ని డ్రామాలు ఆడినా ప్రజలు వారిని విశ్వసించే పరిస్థితి లేదన్నారు.
kiran kumar reddy
Telangana
K Kavitha
BJP

More Telugu News