Cricket: ‘లెగ్ బై’ పరుగుతో భారత్ గెలుపు.. టీమిండియా డగౌట్‌లో నవ్వులే నవ్వులు.. వీడియో ఇదిగో!

Team Indias victory with a leg by run against Afghanistan in 2nd t20i and Laughter in Team India dressing room
  • క్రీజులో దూబే ఉండడంతో సిక్సర్ లేదా ఫోర్ కొట్టి గెలిపిస్తాడనుకుంటే లెగ్ బై రన్ రావడంతో విరబూసిన నవ్వుల పువ్వులు
  • నవ్వు ఆపుకోలేకపోయిన కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఇతర ఆటగాళ్లు
  • వీడియో షేర్ చేసిన బీసీసీఐ.. సోషల్ మీడియాలో వైరల్‌
ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం వేదికగా ఆదివారం ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన 2వ టీ20 మ్యాచ్‌లో  టీమిండియా ఘనవిజయం సాధించింది. 2-0 తేడాతో సిరీస్‌ను ఖాతాలో వేసుకుంది. 172 పరుగుల లక్ష్యాన్ని కేవలం 15.4 ఓవర్లలోనే చేధించినప్పటికీ.. భారత్‌కు మ్యాచ్‌తో పాటు సిరీస్‌ విజయాన్ని కట్టబెట్టిన ఈ గెలుపు ‘లెగ్ బై’ రన్ రూపంలో వచ్చింది. క్రీజులో శివమ్ దూబే, రింకూ సింగ్ ఉండడంతో గ్రాండ్‌గా భారీ సిక్సరో లేదా ఫోరో కొట్టి మ్యాచ్ ఫినిష్ చేస్తారనుకుంటే బైస్ రూపంలో వచ్చిన పరుగుతో విక్టరీ దక్కింది. 

ఆఫ్ఘనిస్థాన్ బౌలర్ ఫారూఖీ వేసిన బంతి దూబే ప్యాడ్స్‌కు తగిలి పక్కకు వెళ్లింది. దీంతో క్రీజులో ఉన్న దూబే, రింకూ సింగ్ లు లెగ్ బై రన్ తీయడంతో భారత్ విజయాన్ని అందుకుంది. దీంతో డగౌట్‌లో ఉన్న టీమిండియా ఆటగాళ్లు నవ్వులు చిందించారు. విరాట్ కోహ్లీ, శుభ్‌మాన్ గిల్, అర్షదీప్ సింగ్‌తో పాటు మిగతా జట్టు సభ్యులందరూ పడిపడి నవ్వారు. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా నవ్వు ఆపుకోలేకపోయాడు. మైదానంలోని ఫ్యాన్స్ ముఖాల్లో చిన్నపాటి నవ్వు కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో‌ను బీసీసీఐ షేర్ చేసింది. దీంతో  సోషల్ మీడియాలో వీడియో వైరల్‌గా మారింది. కాగా ఇరు జట్ల మధ్య బెంగళూరు వేదికగా బుధవారం చివరిదైన 3వ టీ20 మ్యాచ్ జరగనుంది.
Cricket
India vs Afghanistan
Team India
Virat Kohli
Shivam Dhube
Rinku Singhu

More Telugu News