మమ్మల్ని ఎవరూ బెదిరించడాన్ని అనుమతించేది లేదు: మాల్దీవుల అధ్యక్షుడి హెచ్చరిక
- పరోక్షంగా భారత్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించిన మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజ్జు
- మాది చిన్న దేశమే కావొచ్చు.. కానీ బెదిరించే లైసెన్స్ ఇవ్వలేదని వ్యాఖ్య
- ఇండియన్ ఓసియన్ ఏ ఒక్క దేశానికి సంబంధించినది కాదన్న అధ్యక్షుడు
హిందూ మహాసముద్రం ఏ ఒక్క దేశానికీ చెందినది కాదన్నారు. తమ దేశం చిన్న చిన్న ద్వీపాల సమూహం అయినప్పటికీ 900,000 చదరపు కిలో మీటర్ల విస్తారమైన ప్రత్యేక ఆర్థిక మండలిని కలిగి ఉన్నామన్నారు. ఈ మహా సముద్రంలో అత్యధిక వాటాను కలిగి ఉన్న దేశాలలో మాల్దీవులు ఒకటి అన్నారు. మాల్దీవులు స్వతంత్ర, సార్వభౌమ రాజ్యమన్నారు. మాల్దీవుల దేశీయ వ్యవహారాలపై చైనా ప్రభావం ఉండదని స్పష్టం చేశారు.