H1B: ఫిబ్రవరి నుంచి హెచ్1బీ వీసా దరఖాస్తుల ఆన్ లైన్ ఫైలింగ్

  • అమెరికా వెళ్లే వృత్తి నిపుణులకు హెచ్1బీ వీసాలు
  • కీలక ప్రకటన చేసిన అమెరికా
  • రిజిస్ట్రేషన్ల సమర్పణ కోసం ఆర్గనైజేషనల్ అకౌంట్స్ ఏర్పాటు
US announces key statement on H1B visa filing

వివిధ రంగాలకు చెందిన వృత్తి నిపుణులకు కేటాయించే హెచ్1బీ వీసాలపై అమెరికా ప్రభుత్వం కీలక సమాచారంతో కూడిన ప్రకటన విడుదల చేసింది. అమెరికా సిటిజెన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీస్ (యూఎస్ సీఐఎస్) విభాగాల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయని ఆ ప్రకటనలో వెల్లడించారు.

అమెరికా ప్రకటన వివరాలు...

  • హెచ్1బీ వీసా దరఖాస్తుల కోసం ఆన్ లైన్ ఫైలింగ్ ప్రక్రియ ఫిబ్రవరిలో ప్రారంభం
  • హెచ్1బీ వీసా దరఖాస్తు రిజిస్ట్రేషన్ ల కోసం కొత్తగా సంస్థాగత  ఖాతాలు (ఆర్గనైజేషనల్ అకౌంట్స్) అందుబాటులోకి తీసుకువచ్చిన యూఎస్ సీఐఎన్
  • చట్టపరమైన సంస్థలు, ప్రతినిధుల కోసం సంస్థాగత ఖాతాలు మెరుగైన ఫీచర్ లకు రూపకల్పన
  • హెచ్1బీ దరఖాస్తుదారులు తమ సంస్థ ఖాతాల ద్వారా ఫారం ఐ-129, అనుబంధ ఫారం ఐ-907కు సంబంధించిన ప్రీమిండియా ప్రాసెసింగ్ అభ్యర్థనలను ఆన్ లైన్ లో ఫైలింగ్ చేసే సదుపాయం
  • హెచ్1బీ వీసా దరఖాస్తు ప్రక్రియలో పాల్గొనే వ్యక్తులు ఇన్ఫో సెషన్లకు హాజరయ్యేలా యూఎస్ సీఐఎన్ ప్రోత్సాహం
  • హెచ్1బీ ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పేజీలో ఆన్ లైన్ ఫైలింగ్ వివరాలు, సంస్థాగత ఖాతాల వివరాలు అందుబాటులోకి తెస్తున్న యూఎస్ సీఐఎన్

More Telugu News