నేను రెడ్డి వ్యతిరేకిని కాను: వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్
- రెడ్లు తనకు వ్యతిరేకమని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న అనిల్
- రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారే జగన్ ను మోసం చేశారేమో అని వ్యాఖ్య
- అందరితో కలిసి ఉండటం వల్లే రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యానన్న అనిల్
ముక్కుసూటిగా వ్యవహరించడం తన నైజమని... అందుకే తనపై బురద చల్లుతున్నారని చెప్పారు. తాను చెన్నై, హైదరాబాద్ వెళ్లినప్పుడల్లా రెడ్లు మీకు వ్యతిరేకమా? అని పలువురు అడుగుతున్నారని అనిల్ అన్నారు. నెల్లూరులో అందరితో కలిసికట్టుగా ఉండటం వల్లే రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందానని చెప్పారు. తాను ఎవరినీ ఇబ్బంది పెట్టలేదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా రెడ్డి సామాజికవర్గం ఆశీస్సులు, దీవెనలు ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు.