Raghu Rama Krishna Raju: రాజమండ్రిలో రఘురాజుకు ఘన స్వాగతం.. వందలాది కార్లతో భీమవరంకు భారీ ర్యాలీ

Raghu Rama Krishna Raju going to Bhimavaram from Rajahmundry with a huge car rally
  • హైదరాబాద్ నుంచి రాజమండ్రికి చేరుకున్న రఘురాజు
  • పెద్ద ఎత్తున తరలి వచ్చిన టీడీపీ, జనసేన కార్యకర్తలు
  • నాలుగేళ్ల తర్వాత స్వస్థలానికి వెళ్తున్న రఘురాజు
వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఏపీలో అడుగుపెట్టారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి విమానంలో చేరుకున్న ఆయనకు... అభిమానులు బ్రహ్మరథం పట్టారు. గజమాలతో ఆహ్వానం పలికారు. భారీ సంఖ్యలో ఎయిర్ పోర్టుకు చేరుకున్న అభిమానులతో ఆ ప్రాంతం కిక్కిరిసి పోయింది. టీడీపీ, జనసేన కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. రఘురాజు అనుకూల నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తి పోయింది. 

ఇక రఘురాజు కూడా అభిమానులకు ఉత్సాహంగా షేక్ హ్యాండ్ ఇస్తూ ముందుకు సాగారు. రాజమండ్రి నుంచి భీమవరంకు ఆచంట, పాలకొల్లు మీదుగా ఆయన భారీ ర్యాలీగా వెళ్తున్నారు. వందలాది కార్లు రఘురాజును అనుసరిస్తున్నాయి. నాలుగేళ్ల తర్వాత ఆయన స్వస్థలానికి వెళ్తుండటం గమనార్హం. ఈ సంక్రాంతిని తన నియోజకవర్గంలో ఆయన బంధుమిత్రులతో కలిసి జరుపుకోనున్నారు. 
Raghu Rama Krishna Raju
Rajahmundry
Bhimavaram
Rally
Grand Welcome
Telugudesam
Janasena

More Telugu News