Porn Videos: అశ్లీల చిత్రాలను వ్యక్తిగతంగా చూడడం తప్పేమీ కాదు.. మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు

Madras High Court Sensational Verdict On Watching Porn Clips
  • చిన్నారుల అశ్లీల చిత్రాలను మొబైల్‌లో చూసినట్టు యువకుడిపై కేసు
  • చూసింది నిజమే కానీ అవి చిన్నారులవి కావన్న యువకుడు
  • 90లలో యువకులు మద్యానికి, ధూమపానానికి బానిసలు అయినట్టే ఇప్పటి పిల్లలు అశ్లీల చిత్రాలకు బానిసలవుతున్నారన్న కోర్టు
  • నిందలు మాని వారు ఆ వ్యసనం నుంచి బయటపడే మార్గాలు చూడాలని సలహా

మొబైల్ ఫోన్‌లో చిన్నారుల అశ్లీల చిత్రాలు డౌన్‌లోడ్ చేసి చూసినందుకు నమోదైన కేసులో మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసును విచారించిన న్యాయస్థానం వ్యక్తిగతంగా అశ్లీల చిత్రాలు చూడడం నేరం కాదని స్పష్టం చేసింది. తనపై నమోదైన కేసును రద్దు చేయాలని కోరుతూ అంబత్తూరుకు చెందిన యువకుడు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు.

నిన్న ఈ కేసు విచారణకు రాగా.. కోర్టుకు హాజరైన యువకుడు తాను అశ్లీల సినిమాలు చూడడం నిజమేనని, కాకపోతే తాను చూసినవి పిల్లలకు సంబంధించినవి కావని కోర్టుకు తెలిపాడు. ఈ వ్యసనం నుంచి బయటపడేందుకు కౌన్సెలింగ్ తీసుకోవాలని కూడా నిర్ణయించుకున్నట్టు చెప్పాడు. వాదోపవాదాల అనంతరం ఈ కేసును కొట్టివేస్తూ న్యాయమూర్తి జస్టిస్ ఆనంద్ వెంకటేశ్ ఉత్తర్వులు జారీ చేశారు.

అనవసరంగా నిందలు మోపవద్దు
అశ్లీల చిత్రాలను ఫోన్‌లో డౌ‌న్‌లోడ్ చేసుకుని వ్యక్తిగతంగా చూడడంలో ఎలాంటి తప్పు లేదని, వాటిని ఇతరులకు షేర్ చేస్తేనే నేరమని న్యాయమూర్తి స్పష్టం చేశారు. 1990లలోని యువత మద్యం, ధూమపానానికి ఎలా అలవాటయ్యారో, 2కే కిడ్స్ కూడా అలాగే అశ్లీల చిత్రాలకు బానిసలుగా మారారని తెలిపారు. వారిపై అనవసరంగా నిందలు మోపడం మాని ఆ అలవాటు నుంచి వారు బయటపడేందుకు అవసరమైన సలహాలు ఇచ్చేంత పరిణతి సమాజానికి రావాలని అభిప్రాయపడ్డారు. ముుఖ్యంగా స్కూల్ స్థాయిలోనే వారికి ఇలాంటి వాటిపై అవగాహన కల్పించాల్సి ఉందని న్యాయమూర్తి స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News