AP High Court: బీఈడీ కళాశాలల తనిఖీకి ఉన్నత విద్యామండలి ఏర్పాటు... జీవోను కొట్టివేసిన ఏపీ హైకోర్టు

AP High Court suspends govt orders on higher educational committee establishment
  • జీవో నెం.1 విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం
  • హైకోర్టును ఆశ్రయించిన బీఈడీ కళాశాలల సంఘం అధ్యక్షుడు
  • ఉన్నత విద్యామండలి ద్వారా తనిఖీలు జరిపే అధికారం లేదన్న హైకోర్టు 
రాష్ట్రంలోని బీఈడీ కళాశాలల్లో తనిఖీకి ఉన్నత విద్యామండలిని ఏర్పాటును చేస్తూ జనవరి 1న ప్రభుత్వం ఇచ్చిన జీవోను ఏపీ హైకోర్టు నేడు కొట్టివేసింది. ప్రభుత్వం ఇచ్చిన జీవోను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రైవేట్ బీఈడీ కళాశాలల సంఘం అధ్యక్షుడు కె.గుండారెడ్డి పిటిషన్ వేశారు. ఇదే అంశంలో ఇతర బీఈడీ కళాశాలల యాజమాన్యాలు హైకోర్టులో పిటిషన్ వేశాయి. దీనిపై నేడు విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ఇరుపక్షాల వాదనలను వింది. అనంతరం, ఉన్నత విద్యామండలి ద్వారా తనిఖీలు జరిపే అధికారం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రత్యేక అధికారిని నియమించుకుని తనిఖీలు జరుపుకోవచ్చని సూచించింది.
AP High Court
Govt G.O
Higher Educational Committee
BEd Colleges

More Telugu News