Budda Venkanna: కేశినేని నాని క్యారెక్టర్ లేని వ్యక్తి, ఛీటర్, ఊసరవెల్లి: బుద్దా వెంకన్న

Kesineni Nani is a characterless person says Budda Venkanna
  • విశ్వాసం లేని వ్యక్తి కాబట్టే నానికి చంద్రబాబు పదవులు ఇవ్వలేదన్న వెంకన్న
  • చంద్రబాబు, లోకేశ్ గురించి మాట్లాడితే తాట తీస్తామని హెచ్చరిక
  • నాని, జగన్ కలిసి ఉంటారనే నమ్మకం తనకు లేదని వ్యాఖ్య
వైసీపీ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నానిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్ర విమర్శలు గుప్పించారు. టీడీపీ నుంచి ఎంపీలుగా గెలిచిన గల్లా జయదేవ్ కు, రామ్మోహన్ నాయుడులకు చంద్రబాబు పదవులు ఇచ్చారని... నీకు ఎలాంటి పదవి ఇవ్వలేదని... ఎందుకంటే, నీవు విశ్వాసం లేని వ్యక్తివి అంటూ వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నీకు నోటి వాగుడు ఎక్కువయిందని, నిన్ను ఎంకరేజ్ చేయకూడదనే ఉద్దేశంతోనే పదవి ఇవ్వలేదని చెప్పారు. అన్నం పెట్టిన చేతినే కొరికే రకానివని దుయ్యబట్టారు. 

తిరువూరు పార్టీ ఆఫీసుకు వెళ్లి వీరంగం చేశావని నానిపై వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీలో ఉన్నంత వరకు ఎంత వాగినా సహనంతో భరించామని... ఇకపై సహనంగా ఉండబోమని చెప్పారు. చంద్రబాబు, లోకేశ్, వారి కుటుంబం గురించి ఏం మాట్లాడినా తాట తీస్తామని హెచ్చరించారు. మొన్నటి వరకు కేశినేని నాని వెంట తిరిగిన వారంతా తాము నాని వ్యక్తులం కాదని అంటున్నారని... వారికి శాల్యూట్ చేస్తున్నానని అన్నారు. 

చంద్రబాబుకు కొంచెం మొహమాటం ఉంటుందని... లోకేశ్ కు అలాంటివేమీ ఉండవని వెంకన్న చెప్పారు. నాని వ్యక్తిత్వం తెలిసే పాదయాత్రకు నానిని లోకేశ్ దూరం పెట్టారని అన్నారు. ఎన్నికల వరకు కూడా జగన్, నాని కలిసి ఉంటారనే నమ్మకం తనకు లేదని చెప్పారు. ఒకవేళ కలిసి ఉన్నా... నాని అనే క్యారెక్టర్ లేని వ్యక్తి, ఊసరవెల్లి, ఛీటర్ టీడీపీ చేతిలో చిత్తుచిత్తుగా ఓడిపోతాడని జోస్యం చెప్పారు. ఎదుటి వ్యక్తి పచ్చగా ఉంటే ఓర్చుకోలేని వ్యక్తిత్వం నానిదని విమర్శించారు. పది రోజుల క్రితం జగన్ ను నాని తిట్టారని... అలాంటప్పుడు వైసీపీ ఎంపీ టికెట్ తీసుకోవడానికి నానికైనా సిగ్గుండాలి లేదా టికెట్ ఇచ్చినందుకు జగన్ కైనా సిగ్గుండాలని అన్నారు.
Budda Venkanna
Chandrababu
Nara Lokesh
Telugudesam
Kesineni Nani
Jagan
YSRCP

More Telugu News