Budda Venkanna: చంద్రబాబు ముందు నువ్వొక కోన్ కిస్కా గొట్టం: కేశినేని నానిపై బుద్దా వెంకన్న ఫైర్

Kesineni Nani is nothing before Chandrababu says Budda Venkanna
  • కేశినేని వంటి ఎంపీలను చంద్రబాబు వందల మందిని తయారు చేశారన్న వెంకన్న
  • చంద్రబాబు మంచితనాన్ని కేశినేని నాని, కొడాలి నాని, వంశీ అలుసుగా తీసుకున్నారని మండిపాటు
  • కేశినేని నానిలో అప్పుడే భయం మొదలయిందని వ్యాఖ్య
వైసీపీ తీర్థం పుచ్చుకున్న ఎంపీ కేశినేని నానిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న విరుచుకుపడ్డారు. విజయవాడను చంద్రబాబు అభివృద్ధి చేయలేదన్న నాని వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. విజయవాడలోని ఫ్లైఓవర్లు, రోడ్లు అన్నీ చంద్రబాబు వేయించినవే అని చెప్పారు. నీలాంటి ఎంపీలను వందల మందిని చంద్రబాబు తయారు చేశారని అన్నారు. నువ్వు ఆఫ్ట్రాల్ ఒక బచ్చావని విమర్శించారు. చంద్రబాబు ముందు నువ్వు కోన్ కిస్కా గొట్టం అని అన్నారు. ఆఫ్ట్రాల్ ఒక ఎంపీవి నీవు విజయవాడను అభివృద్ధి చేయడం ఏమిటని దుయ్యబట్టారు. ఎన్డీయే భాగస్వామిగా ఉన్న చంద్రబాబు ఇవన్నీ చేశారని... జగన్ సీఎం అయిన తర్వాత విజయవాడలో నీవు ఒక్క పని కూడా ఎందుకు చేయించలేకపోయావని ప్రశ్నించారు. 

కొడాలి నాని, వల్లభనేని వంశీ, కేశినేని నాని వంటి వారు చంద్రబాబు మంచితనాన్ని అలుసుగా తీసుకున్నారని... చంద్రబాబు ముందు కుప్పిగంతులు వేశారని వెంకన్న అన్నారు. జగన్ ముందు కుప్పిగంతులు వేస్తే తన్ని తరిమేస్తారని చెప్పారు. కేశినేని నానిలో అప్పుడే భయం మొదలయిందని... అందుకే దేవినేని అవినాశ్ ను వెంట పెట్టుకుని జగన్ వద్దకు వెళ్లారని ఎద్దేవా చేశారు. ఇంకా వైసీపీ కండువా కూడా కప్పుకోని నానికి ఎంపీ టికెట్ ఇవ్వడమనేది... వైసీపీ దారుణ పరిస్థితిని సూచిస్తోందని అన్నారు. 

పెద్ద ఆస్తిపరుడు, విజయవాడలో లంకంత ఇల్లు, నగరం నడిబొడ్డులో ఒక పెద్ద కేశినేని భవన్, స్టార్ హోటల్స్ ఉన్న నీవు బ్యాంకులకు డబ్బులు ఎందుకు ఎగ్గొడుతున్నావని వెంకన్న ప్రశ్నించారు. బ్యాంకుల డబ్బు అనేది ప్రజాధనమని... ఈ ఐదేళ్లలో ఏయే బ్యాంకుకు ఎంతెంత కట్టావని అడిగారు. తనపై ఏ పత్రికలో కూడా ఇంతవరకు ఆరోపణలు రాలేదని, సాక్షి పేపర్ లో కూడా రాలేదని... నాని భూములు కబ్జా చేసినట్టు పేపర్లలో వచ్చాయని చెప్పారు.
Budda Venkanna
Chandrababu
Nara Lokesh
Telugudesam
Kesineni Nani
Kodali Nani
Vallabhaneni Vamsi
Jagan
YSRCP

More Telugu News