Revanth Reddy: మైక్రాన్ కంపెనీ సీఈవోకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా

Micron CEO Sanjay meets Telangana CM Revanth reddy
  • సీఎం నివాసంలో రేవంత్ రెడ్డిని కలిసిన సీఈవో సంజయ్
  • పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం నుంచి సహకారం ఉంటుందని సీఎం హామీ
  • తెలంగాణ అభివృద్ధికి పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని పిలుపు
పరిశ్రమల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని మైక్రాన్ కంపెనీ సీఈవో సంజయ్‌కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. గురువారం సాయంత్రం సంజయ్... సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నింటికి తగిన సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన అవసరమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధికి పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.
Revanth Reddy
micron
Telangana

More Telugu News