Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యాపకుల బృందం

A team of faculty from Harvard University in America paid a courtesy call on Revanth Reddy
  • డాక్టర్ డొమినిక్ మావో నేతృత్వంలో ముఖ్యమంత్రిని కలిసిన అధ్యాపకుల బృందం
  • రేవంత్ రెడ్డి నివాసంలో గురువారం సాయంత్రం భేటీ
  • ఓయూలో ఏడో తేదీ నుంచి నిర్వహిస్తోన్న పీఎస్‌ఐఎల్‌-24 కార్యక్రమం గురించి వివరణ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యాపకుల బృందం కలిసింది. డాక్టర్ డొమినిక్ మావో నేతృత్వంలో యూనివర్సిటీ అధ్యాపకుల బృందం... రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో గురువారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిసింది. ఉస్మానియా యూనివర్సిటీలో జనవరి 7వ తేదీ నుంచి నిర్వహిస్తోన్న ప్రోగ్రామ్ ఫర్ సైంటిఫిక్లీ ఇన్‌స్పైర్డ్ లీడర్‌షిప్ (పీఎస్‌ఐఎల్‌-24) కార్యక్రమం గురించి ముఖ్యమంత్రికి వారు వివరించారు. అంతకుముందు, ఉదయం గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ తోట ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు.
Revanth Reddy
harward university
Telangana
osmania university

More Telugu News