ప్రజలతో కలిసి భోజనం చేసి... రోడ్డుపై మొక్క జొన్న కంకిని కొనుక్కొని తిన్న మంత్రి సీతక్క
- ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోని నిర్మల్, ఖానాపూర్, కడెం, మార్లవాయి ప్రాంతాల్లో పర్యటించిన సీతక్క
- మార్లవాయిలో గ్రామస్తులతో కలిసి భోజనం చేసిన మంత్రి
- ఉడుంపూర్ వద్ద ఆగి రోడ్డుపై మొక్కజొన్న కంకి కొనుక్కున్న సీతక్క
ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో పర్యటన
సీతక్క నిన్న ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఖానాపూర్ నియోజకవర్గంలోని సదర్ ఘాట్ కాల్వను ఎమ్మెల్యే వెడ్మ బోజ్యతో కలిసి పరిశీలించారు. ఖానాపూర్ రైతులకు సదర్ ఘాట్ కాల్వ నుంచి నీరు అందిస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత నిర్మల్‌లోని కడెం ప్రాజెక్టును పరిశీలించారు. మార్లవాయిలో 18 లక్షల వ్యయంతో నిర్మించిన హైమన్ డార్ఫ్ మ్యూజియంను ప్రారంభించారు. డార్ఫ్ స్ఫూర్తితో ఆదివాసీల అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు.