Team India: మొహాలీలో తొలి టీ20... ఆఫ్ఘనిస్థాన్ పై టాస్ గెలిచిన టీమిండియా

Team India won the toss against Afghanistan in 1st T20
  • టీమిండియా, ఆఫ్ఘనిస్థాన్ మధ్య 3 మ్యాచ్ ల టీ20 సిరీస్
  • నేడు మొహాలీలో మ్యాచ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
  • 57 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఆఫ్ఘన్
టీమిండియా, ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ప్రారంభమైంది. నేడు మొహాలీలో తొలి టీ20  జరుగుతోంది. టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. దాంతో మొదట బ్యాటింగ్ కు దిగిన ఆఫ్ఘన్ జట్టు 10 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 57 పరుగులు చేసింది. ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్ 23, ఇబ్రహీం జాద్రాన్ 25 పరుగులు చేసి వెనుదిరిగారు. రహ్మత్ షా (3) స్వల్ప స్కోరుకే అవుటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో అజ్మతుల్లా ఒమర్జాయ్ (2 బ్యాటింగ్), మహ్మద్ నబీ (0 బ్యాటింగ్) ఉన్నారు. టీమిండియా బౌలర్లలో అక్షర్ పటేల్ 2, శివమ్ దూబే 1 వికెట్ తీశారు.
Team India
Toss
Afghanistan
1st T20
Mohali

More Telugu News