Steve Smith: జకోవిచ్ తో టెన్నిస్ ఆడిన ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్... వీడియో ఇదిగో!

Steve Smith played tennis with Novak Djokovich ahead of Australian Open
  • జనవరి 14 నుంచి ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీ
  • ప్రస్తుతం టోర్నీకి సంబంధించిన క్వాలిఫైయింగ్ పోటీల నిర్వహణ
  • ఓ ఎగ్జిబిషన్ మ్యాచ్ లో తలపడిన జకోవిచ్-స్టీవ్ స్మిత్
టెన్నిస్ సీజన్ మళ్లీ మొదలవుతోంది. ముందుగా ఆస్ట్రేలియన్ ఓపెన్ షురూ కానుంది. జనవరి 14న ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీకి తెరలేవనుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియన్ ఓపెన్ కు సంబంధించిన క్వాలిఫైయింగ్ పోటీలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఓ ఎగ్జిబిషన్ మ్యాచ్ నిర్వహించారు. ఈ మ్యాచ్ లో టెన్నిస్ దిగ్గజం నొవాక్ జకోవిచ్ తో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఆడడం విశేషం. ఈ మ్యాచ్ ఎంతో సరదాగా సాగింది. మ్యాచ్ ఆద్యంతం జకోవిచ్... స్టీవ్ స్మిత్ ను ప్రోత్సహిస్తూ ఆడియన్స్ ను అలరించాడు. క్రికెట్ లో స్టార్ డమ్ అందుకున్న స్టీవ్ స్మిత్... టెన్నిస్ రాకెట్ చేతబట్టి జకో అంతటివాడితో ఆడుతూ చక్కగా ఆస్వాదించాడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.
Steve Smith
Tennis
Novak Djokovich
Australian Open

More Telugu News